తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్‌ నెలలో రాబోతున్న పెద్ద సినిమాలు ఏంటో చెప్పగలరా ? చెప్పలేరు ఎందుకంటే ఈ వేసవి బాక్సాఫీస్ లో అత్యంత ముఖ్యమైన ఏప్రిల్ లో అసలు నిజంగానే పెద్ద సినిమాలు ఏమీ రావట్లేదు .. ప్రభాస్ రాజాసాబ్‌ వాయిదా పడటం తో ఏప్రిల్ బాక్స్ ఆఫీస్ కు పెద్ద డిసప్పాయింట్ గా మారింది .. అయితే ఇప్పుడు థియేటర్లోకి వస్తున్న సినిమాలు కంటే ఈ నెలలో మార్కెట్లోకి వస్తున్న కొన్ని ప్రకటనలు మాత్రం అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి .. ఎస్ ఏప్రిల్ నెలలో థియేటర్లో కంటే బ‌య‌టే ఎక్కువగా సందడి ఉండబోతుంది ..


ఎగ్జాంపుల్ శ్రీరామనవమి అకేషన్ నే తీసుకోండి ఆరోజు రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్‌ రిలీజ్ చేయబోతున్నారు .. ఆ తర్వాత మరో రెండు రోజుల కు అల్లు అర్జున్ పుట్టినరోజు రాబోతుంది ఆరోజు బన్నీ అట్లి సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయ‌బోతున్నారు . ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తర్వాత సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తుంది .. ఇక ఎప్పుడూ ఆ ఉత్కంఠకు తెరాదించేందుకు ఏప్రిల్ 8 న బన్నీ , అట్లీ సినిమాను అధికారం గా ప్రకటించబోతున్నారు .. ఇక అదే రోజున అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమాను కూడా ప్రకటించాలని హారిక హాసిని బ్యానర్ భావిస్తుంది .  అయితే దీని పై ఇంకా స్పష్టత రాలేదు ..


ఇక ఏప్రిల్ నెలలో రాజాసాబ్ టీజ‌ర్ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి .. ఇక రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారట .  ఇక మే 9న రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని పవన్ హరిహర వీరమల్లు ట్రైలర్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది .. ఇక వీటితో పాటు మహేష్ , రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉంది . మరోపక్క విశ్వంభర రిలీజ్ తేదీని ప్రకటన‌ . మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా ఏప్రిల్ నెలలోనే రాబోతున్నాయి . ఇలా మొత్తంగా ఏప్రిల్ థియేటర్లో కంటే మార్కెట్లోనే ఎక్కువ సందడి కనిపించబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: