టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఉగాది కానుకగా ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాదు లో ఎంతో గ్రాండ్గా జరిగాయి .. అయితే ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు . ఇక ఈ సినిమా ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిసూడి ప్రకటించిన విషయం తెలిసిందే .  


అలాగే అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది .. ఇక ఈ సినిమా కు మెగా 157 , చిరు , అనిల్ మూవీ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు . అయితే ఇప్పుడు ముందుగా ఈ సినిమా లో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ అదితి రావు హైదరీ పేరు ముందుగా తెరపైకి వచ్చింది ..  అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. తాజాగా దర్శకుడు మరో బాలీవుడ్ బ్యూటిని హీరోయిన్గా తీసుకోవడానికి సంప్రదించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది .


 అంతేకాకుండా ఆమెకు అనిల్ రావిపూడి కథ కూడా చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది .. ఇంతకీ ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ పరిణితి చోప్రా .. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త వైరల్ గా మారింది .. అయితే ఈ విషయం తెలుసుకున్న నేటిజ‌న్లు వీరిద్దరు కాంబోలో సినిమా అంటే సూపర్ అంటూ కామెంట్లో చేస్తున్నారు .. కాగా ఫైనల్గా అదితి రావు హైదరీ , పరిణితి చోప్రా ఇద్ద‌రి లో ఎవరో ఒకరు ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతున్నారనేది తెలియాలంటే అధికార  ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: