తెలుగులో హీరో నితిన్ వెండి తెరకు పరిచయమైన మూవీ జయం .. తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ  విజయాన్ని అందుకుంది .. అలాగే యూత్ కు నచ్చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా . అయితే ఇందులో నితిన్ కు జంటగా సదా హీరోయిన్గా నటించింది .. దర్శ‌కుడు తేజ తెర్కక్కించిన ఈ సినిమాతోనే నితిన్ , సదా ఇద్దరూ టాలీవుడ్ కు పరిచయమయ్యారు .. ఇక అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . అలాగే ఈ సినిమా లోని పాటలు గురించి కూడా అందరికీ తెలిసిందే .. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల మన‌సులో నిలిచిపోయాయి . ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం సినిమా కి హైలెట్గా నిలిచింది .


 అలాగే ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించాడు .. జయం సినిమా లో నితిన్ , సదా , గోపీచంద్ ముగ్గురి నటనపై ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి ..అయితే ఈ సినిమాలో సద కంటే ముందు మరో బ్యూటీని హీరోయిన్గా ఫిక్స్ చేశారట .. ఇంత‌కి ఆ హీరోయిన్   ఎవరంటే .. అసలు ఎవరు ఊహించలేరు కూడా .. ఇంత‌కి ఆమె మరెవరో కాదు అందాల యాంకర్ రష్మీ గౌతమ్ .  నితిన్ రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అయితే రాబిన్ హూడ్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకు గెస్ట్ గా వెళ్ళాడు నితిన్ అ షోకురష్మీ యాంకర్ గా చేసింది .. అయితే ఆ షోలో నితిన్ ఆసక్తికరంగా తన తొలి సినిమా జయం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు .


జయం సినిమాకు రష్మితో కలిసి పలు రిహార్సిల్స్ చేశారట నితిన్ .. జయం సినిమా కోసం దాదాపు 90 % రష్మిక తోనే రిహార్సిల్స్ చేశారట నితిన్.. కానీ ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేశారట .. ఇక దాంతో రష్మీ ప్లేస్ లో హీరోయిన్గా సదా వచ్చిందట .. ఈ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే ఆమె స్టార్‌ హీరోయిన్ రేంజ్ కు కూడా వెళ్ళలేదని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .  అయితే రష్మీ యాంకర్ గా ఎన్నో టీవీ షోలు చేసింది .. అలాగే హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటించింది .  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది . రష్మిక కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: