ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయినా మోనాలిసా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తానంటూ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆఫర్ చేశాడు. అయితే ఇప్పుడు సనోజ్ మిశ్రా రేప్ కేసులో అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.... ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉన్న యువతి మోనాలిసాను ప్రజలు ఫేమస్ చేశారు. మోనాలిసా చాలా అందంగా ఉందని తన ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అంతేకాకుండా మోనాలిసాతో సెల్ఫీలు కూడా తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే మోనాలిసాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.


దీంతో మోనాలిసాకు సినిమా అవకాశాలు ఇస్తానంటూ దర్శకులు సైతం తన ఇంటి ముందుకు వెళ్లారు. అంతేకాకుండా మోనాలిసా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ మధ్యకాలంలో ఈ యువతి చాలా యాక్టివ్ గా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోగా వాటికి విపరీతంగా లైక్స్ వస్తున్నాయి. సాధారణ యువతి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఇంత ఫేమస్ అవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కాగా, ఈ బ్యూటీకి బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సినిమా అవకాశాలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు.


దానికి మోనాలిసా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సనోజ్ మిశ్రాకు సడన్ గా షాక్ తగిలింది. సనోజ్ మిశ్రాను రేప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తనను సనోజ్ మిశ్రా లైంగికంగా వేధించాడని అంతేకాకుండా తన వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు అంటూ ఓ యువతి ఫిర్యాదుతో సనోజ్ మిశ్రా పైన కేసు నమోదు అయింది. ప్రస్తుతం సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువతి కావాలనే సనోజ్ మిశ్రాపైన తప్పుడు ప్రచారం చేస్తుందని కొంతమంది అంటున్నారు.

 తనకు సినిమా అవకాశాలు ఇవ్వనందుకు అతనిపై కోపంతో ఆ యువతి డైరెక్టర్ సనోజ్ మిశ్రాపైన ఇలా కేసు నమోదు చేసిందని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా "ది డైరీ ఆఫ్ మణిపుర్" సినిమాలో హీరోయిన్ గా మోనాలిసాను అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఎంపిక చేశారట. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఇంతలోనే సనోజ్ మిశ్రాపైన ఇలా కేసు నమోదు అవ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: