టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమాలో తన నటన చూసిన దర్శకనిర్మాతలు సినిమాలలో హీరోగా అవకాశాలు ఇచ్చారు. అనంతరం పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ అందుకున్నాడు.


సినిమా అనంతరం అర్జున్ రెడ్డి సినిమాలో నటించి రౌడీ హీరోగా ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అంతేకాకుండా గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు నిలవడం విశేషం. ఈ రెండు చిత్రాల అనంతరం విజయ్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. తాను నటించిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఏమాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న ఉగాది పండుగ సందర్భంగా విజయ్ దేవరకొండ ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించారు. అయితే విజయ్ దేవరకొండ అక్కడ సింగిల్ గానే కనిపించారు. కానీ అక్కడికి విజయ్ దేవరకొండతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా అక్కడికి వచ్చారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ కలిసి ముంబైకి వెళ్లారని టాక్ వినిపిస్తోంది. చాలాకాలం నుంచి విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ వారి రిలేషన్షిప్ ను ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక వారి ప్రేమ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ జంట వివాహం చేసుకుంటే చాలా బాగుంటుందని రష్మిక, విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: