టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతూనే ఉన్నారు. అలాంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిధా అయ్యారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రకుల్సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. 

ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి అవార్డులను సైతం పొందింది. అయితే ఈ బ్యూటీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ వంటి సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ చిన్నది ఎక్కువగా హిందీ సినిమాలలో నటిస్తుండడం విశేషం. ఇక తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు జాకీ భగ్నాని ప్రేమించి వివాహం చేసుకుంది.


వివాహం తర్వాత రకుల్ తన అందాల ఆరబోతలో ఏ మాత్రం రాజీ పడడం లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. రకుల్ జిమ్ చేస్తున్న సమయంలో గాయపడిందట. అయితే ఆ గాయం అయ్యి చాలా రోజులు అయినప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని రకుల్ వెల్లడించారు.

గత సంవత్సరం వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో గాయపడినట్లుగా రకుల్ చెప్పారు. తాను చాలా విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. అయితే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలలో మాత్రమే నటిస్తున్నానని పేర్కొన్నారు. రకుల్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. మళ్లీ ఎప్పటిలానే ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: