ఒకప్పటి కాలంలో హీరోయిన్లు ఎంతో సాంప్రదాయంగా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రాణించారు. అలాంటి వారిలో నటి సిమ్రాన్ ఒకరు. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన అంద చందాలతో సినిమాలలో వరసగా అవకాశాలను అందుకుంది. ఒకానొక సమయంలో సిమ్రాన్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రాణించిందని చెప్పవచ్చు. 


బాలకృష్ణ, చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి తన సత్తాను చాటుకుంది. స్టార్ హీరోలతో పోటీపడి మరి సినిమాలలో నటించేది. ఇక కొన్ని సంవత్సరాల పాటు సినిమాలలో హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఏవో కొన్ని కారణాలతో సినిమాలనుంచి తప్పుకుంది. తనకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల సినిమా అవకాశాలను కోల్పోయింది. అనంతరం కొద్ది రోజులకి సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇప్పుడు కేవలం అత్త, అమ్మ వంటి పాత్రలలో నటిస్తూ తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకుంటుంది. ఈ చిన్న దానికి వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ సినిమాలలో నటిస్తూ ఉండడం విశేషం. అయితే ఈ మధ్యకాలంలో సిమ్రాన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. సిమ్రాన్ సినిమాలలో నటిస్తున్న సమయంలో చాలామంది హీరోలతో ప్రేమాయణం, ఎఫైర్లు కొనసాగించినట్లుగా అనేక రకాల రూమర్లు వచ్చాయి.

 అయితే ఆ రూమర్లపై సిమ్రాన్ ఏ విధంగాను స్పందించలేదు. అంతేకాకుండా సిమ్రాన్ సినిమాలలో నటిస్తూనే తనకన్నా 20 ఏళ్లు పెద్దవాడైన హీరోతో ఎఫైర్ పెట్టుకుందట. అంతేకాకుండా అతనితో చట్టపట్టలేసుకొని తిరగడం, షికార్లు చేయడం వంటివి చేశారట. అంతేకాకుండా వీరిద్దరు వివాహం చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఏవో అనివార్య కారణాలవల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత ఎప్పటిలానే సిమ్రాన్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: