టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో హీరోయిన్లుగా రాణిస్తారు. ఇక మరికొంతమంది అందం, నటన ఉన్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతారు. అలాంటి వారిలో నటి రెజీనా ఒకరు. ఈ చిన్నది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. తన నటన, అందం, చలాకితనంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. రెజీనా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.



అయినప్పటికీ ఏమైందో తెలియదు ఈ మధ్య ఈ చిన్నది తెలుగులో పెద్దగా సినిమాలలో నటించడం లేదు. వివిధ భాషలలో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. రెజినా మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.... ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.... అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.


ఈ క్రమంలోనే ఈ చిన్నవి తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు రెజీనా పెళ్లి కూతురిలా రెడీ అయిందని... తొందర్లోనే వివాహం చేసుకుంటుందేమోనని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఆ ఫోటోలు పెళ్లి ఫోటోలు కాదని అంటున్నారు. అయితే ఈ ఫోటోలు నిన్న ఉగాది సందర్భంగా రెజీనా తీసుకున్న ఫోటోలు అని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా తాను పోస్ట్ చేసిన ఫోటోకి రెజినా క్యాప్షన్ కూడా జత చేసింది.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అనంతరం రెజినా అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. తాను ఇప్పుడే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేదని సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాతనే రెజీనా వివాహం చేసుకుంటుందని కొంతమంది అంటున్నారు. మరి ఈ బ్యూటీ సినిమాలలో రాణించిన తర్వాతనే వివాహం చేసుకుంటుందా లేదా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు. వివాహానికి సంబంధించి రెజినా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: