తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా సక్సెస్ అయినా కొంతమందిలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు.. అలా పాపులారిటీ సంపాదించిన తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరోగా మారి పర్వాలేదు అనిపించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని నితిన్ భరతులు డైరెక్షన్ చేశారు. ఇందులో హీరోయిన్గా దీపికా పిల్లి నటించింది. ఇటీవలే టీజర్, పాటలతో, పోస్టర్లతో హైప్ తీసుకువచ్చిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ని రిలీజ్ చేశారు.



ట్రైలర్ విషయానికి వస్తే .. మెట్రోపాలసి సిటీకి ప్రాజెక్టు మీద హీరో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ కేవలం 60 మంది మాత్రమే ఉంటారు. 60 మంది తప్ప ఆ ఊర్లో మరెవరిని కూడా రానివ్వరు.. ఇక ఆ ఊరు పెద్దమనిషి కూతురుని  అదే ఊర్లో ఉండే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతారు. దీంతో ఆ ఊర్లో ఉండే 60 మంది దీపిక పిల్లిని పడేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఇంతకీ హీరో ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? మరి హీరోయిన్ ని వివాహం చేసుకున్నారా లేదా అనే కథాంశం తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.


ప్రదీప్, కమెడియన్ సత్యా మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ట్రైలర్లో హైలెట్గా మారుతున్నాయి. ఈ చిత్రంతో కచ్చితంగా సక్సెస్ అందుకునేలా కనిపిస్తూ ఉన్నారు ప్రదీప్. ట్రైలర్ కి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పిల్లి  సక్సెస్ అవుతుందా హీరోగా ప్రదీప్ విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి మరి. బుల్లితెర మీద యాంకర్ గా అలరించిన ప్రదీప్ మరి ఏమి ఎరకు సక్సెస్ అవుతారనే విషయం తెలియాలి అంటే ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: