పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి శుభవార్త కూడా కుటుంబ సభ్యులు తెలుపలేదు. దీంతో అభిమానులు కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల వీడియోలను, ఫోటోలను సైతం ఎడిట్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ అనుష్క శెట్టి తో కలిసి ప్రభాస్ కు సంబంధించిన పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం ఎక్కువగా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరిద్దరి జంట బాగుంటుందని గతంలో కూడా వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్నట్లుగా రూమర్స్ వినిపించాయి.


ముఖ్యంగా అటు ప్రభాస్ కానీ అనుష్క కానీ ఇప్పటివరకు వివాహం చేసుకోకపోవడంతో ఈ రూమర్స్ కు మరింత స్థానం కల్పించారు. తాజాగా ప్రభాస్ అనుష్కకు వివాహమయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇందులో ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడ పాప ఉన్నట్లుగా పలు రకాల ఫోటోలను సైతం  ఎడిటింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. Ai క్రియేట్ తో చేశారన్నట్లుగా పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.


మొత్తానికి ఇలా అయితే సరిపెట్టుకుంటున్న అభిమానులకు మరి ప్రభాస్ పెళ్లి తో ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ తదితర హీరోయిన్ కూడా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేనెల 10వ తేదీ థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉన్నది.. పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది. ఇవే కాకుండా స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాల షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: