
ఇక అనుష్క శెట్టి ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకుంది. అనుష్క వయసు 40 ఏళ్లకు పైనే అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. ఇక ఈ చిన్నది ఇప్పుడు సినిమాలలో పెద్దగా నటించడం లేదు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతోంది. అనుష్క తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. అందులో అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి.
ఈ సినిమాలో అనుష్క తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంది. అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాలో అనుష్క జేజమ్మగా అద్భుతంగా నటించింది. అరుంధతి సినిమాలో జేజమ్మ క్యారెక్టర్ కోసం ముందుగా అనుష్కను కాకుండా అలనాటి నటి ప్రేమని అనుకున్నారట. కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమాలో నటి ప్రేమ నటించనని చెప్పిందట. అనంతరం ఆ పాత్ర కోసం అనుష్క శెట్టి వద్దకు వెళ్లగా తాను వెంటనే ఓకే చెప్పారట. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విడుదలైన అనంతరం నటి ప్రేమ ఆ సినిమాను చూసి చాలా బాధపడ్డారట. ఆ సినిమాలో నేను నటించి ఉంటే ఇంకా బాగుండేదని అనుకున్నారట. ఈ సినిమాలో అనుష్క నటించిన వల్ల తన కెరీర్ కి పెద్ద దెబ్బ ఎదురైందని నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రేమ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.