సినీ ప్రియులకు శుభవార్త. మంచి టాక్ ని సొంతం చేసుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 3 త్వరలో రానుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా 2019లో విడుదల అయ్యి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్  రెండో సీజన్ 2021లో రిలీజ్ అయ్యింది. సీజన్ వన్ అండ్ సీజన్ టూ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ పదకొండు ఫిల్మ్ ఫెర్ ఓటీటీ అవార్డులు దక్కించుకుంది. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఐదు ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డులు, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది.


ఈ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడెప్పుడ అంటూ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ గతేడాది మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సిరీస్ చివరి దశకు చేరుకుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించిన మనోజ్ బాజ్ పాయ్ ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విడుదల అవుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యామిలీ మ్యాన్ ఫాన్స్ అందరూ ఫుల్ ఖుషిలో ఉన్నారు.

 
ఇక ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటి నుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఈ వారం థియేటర్ లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: