మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటికీ చిరంజీవి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చిరంజీవి తన సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను చేశారు. నిన్న ఉగాది రోజున పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి వెంకటేష్ వచ్చారు. 

ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించమని వెంకటేష్ ను అనిల్ రావిపూడి కోరారట. అయితే దానికి వెంకటేష్ కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో రీసెంట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలో వెంకటేష్ ను నటించమని కోరుతున్నారట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఇంతవరకు ఫిక్స్ కాలేదు. మెగా హీరో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారని అభిమానులు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


కాగా అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా వెంకటేష్ కు కుమారుడి పాత్రలో బుల్లి రాజు అద్భుతంగా నటించాడు. తన నటన సినిమాకే ప్లస్ పాయింట్ అయింది. బుల్లి రాజు కామెడీ టైమింగ్ కి అభిమానులు ఎంతగానో ఫీదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: