
తాజాగా సర్దార్ 2 గ్లింప్స్ సైతం విడుదల చేయగా ఈ గ్లింప్స్ లో సర్దార్ ఈసారి చైనాకు వెళ్లి మరి అక్కడ కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫైట్ సీను కూడా హైలెట్ గా ఉన్నది. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటించబోతున్నారు. అలాగే తండ్రి కొడుకులుగా కార్తీ మరొకసారి ఇందులో నటిస్తున్నట్లు చూపించారు. ఈ గ్లింప్స్ కు మాత్రం రెస్పాన్స్ భారీగా వస్తోందని.. ఈ గ్లింప్స్ చూశాక సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోతున్నాయని కూడా అభిమానులు తెలియజేస్తున్నారు.
ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. గతంలో తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేసిన ఈ సినిమాని ఈసారి సీక్వెల్ ను మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గింప్స్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించిన కార్తీ మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇవే కాకుండా కార్తీ ఖైదీ 2 చిత్రంలో కూడా త్వరలోనే నటించబోతున్నట్లు తెలుస్తోంది.