మలయాళం లో సూపర్ స్టార్ గా పేరుపొందిన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన L2 ఎంపురాన్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ సంపాదించినప్పటికీ విడుదలైన నాలుగు రోజులకు ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిందట. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇంత తక్కువ సమయంలోనే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఏది లేదని తెలియజేస్తున్నారు.

గత నెల 27వ తేదీన ఈ సినిమా మొదటి రోజు నుంచి భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాకుండా వీకెండ్ కి హాలిడేస్ ఉండడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అలాగే మరొకవైపు కొన్ని వివాదాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో ఒక వర్గాన్ని సైతం తక్కువ చేసి చూపించాలనే విధంగా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తమిళనాడులోని ఒక రిజర్వాయర్ సన్నివేశం తీసేయాలంటూ అక్కడ తమిళనాడు రైతులు కూడా ఫైర్ అవుతూ ఉన్నారట.


ముఖ్యంగా రైతులకు కూడా ధర్నాకు కూడా సిద్ధమవుతున్నారని తెలియడంతో అటు మోహన్ లాల్ ,పృథ్వీరాజ్ ఇద్దరూ కూడా క్షమాపణలు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వివాదాలు ఎన్ని చుట్టుముట్టినప్పటికీ కూడా అంతే కలెక్షన్స్ నే రాబడుతోంది L2 ఎంపురాన్. ఇప్పటివరకు మంజుమ్మల్ బాయ్స్  సినిమా పేరిట ఉన్నటువంటి 200 కోట్ల రికార్డులను సైతం మోహన్ లాల్ కేవలం నాలుగు రోజులలోనే రాబట్టారు.మరి రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. మరి ఏ మేరకు మొత్తం కలెక్షన్స్ మీద ఎలాంటి సరికొత్త రికార్డులను మోహన్లాల్ తీరగా రాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: