దాదాపు రెండు సంవత్సరాల క్రితం మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ని థియేటర్లలో విడుదల చేశారు. మొదటి నుండి మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ భారీ ఎత్తున విడుదల అయింది. ఇక ఈ సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే విడుదల అయిన 3 వ రోజు మీడియం రేంజ్ సినిమాలలో మ్యాడ్ స్క్వేర్ మూవీ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదల అయిన 3 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్ట్ లో మ్యాడ్ స్క్వేర్ మూవీ అద్భుతమైన స్థానంలో నిలిచింది.

విడుదల అయిన 3 వ రోజు మీడియం రేంజ్ మూవీలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల ఈస్ట్ లో తండెల్ మూవీ 8.40 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఆ తర్వాత ఉప్పెన మూవీ 8.26 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , టిల్లు స్క్వేర్ మూవీ 7.44 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో కొనసాగుతుంది. ఇక దసరా సినిమా 6.73 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , తాజాగా థియేటర్లలో విడుదల అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ 5.88 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతుంది. ఇలా మ్యాడ్ స్క్వేర్ మూవీ 3 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ సినిమాల లిస్ట్ లో 5 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: