నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో  తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆరు పదుల వయస్సులో ఉన్నా కానీ కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాల్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో సూపర్ సక్సెస్ రేట్ సినిమాలు ఉన్నాయి అంటే ఆ క్రెడిట్ బాలకృష్ణకే దక్కుతుంది. అలాంటి బాలయ్య కేవలం చిత్రాలే కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి  అదరహో అనిపించారు. ఇంతటి సీనియర్ హీరో  పదో తరగతి చదివే అమ్మాయితో  రొమాన్స్ చేయాలనుకున్నారట.. మరి ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం. బాలకృష్ణ కెరియర్ లో ఎన్నో చిత్రాలు ఉన్నాయి.కానీ వీటన్నింటిలో అద్భుతంగా హిట్ అయిన చిత్రం ఆదిత్య 369.. 

గ్రాఫిక్స్ లేని సమయంలోనే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను తీసి అదరహో అనిపించారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో  అందులో నటించడం కోసం నలుగురు హీరోయిన్లు తీవ్రంగా పోటీ పడ్డారట. అంతేకాదు ఆ పదవ తరగతి చదువుతున్న హీరోయిన్ కూడా సినిమాలో నటించడానికి పోటీకి వచ్చిందనే వార్తలు వినిపించాయి. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే.. ఈ సినిమాకి ముందుగా బాలీవుడ్  ఊర్మిళ మటోండ్కర్ ని అనుకున్నారట. కానీ ఆమెకు అప్పటికే ఒక హిందీ చిత్రంలో డేట్స్ ఉండడంతో టైం కుదరలేదట. ఆ తర్వాత విజయశాంతి తీసుకుందామని భావించారట.

కానీ అప్పటికే బాలకృష్ణతో విజయశాంతి ముద్దుల మామయ్య, భలే దొంగ, లారీ డ్రైవర్ వంటి సినిమాలు వరుసగా చేసింది. నాలుగో సినిమా కూడా ఆమెనే హీరోయిన్ గా పెడితే బాగుండదని ఆమెను రిజెక్ట్ చేశారట. చివరికి దివ్యభారతిని తీసుకుందామనుకున్నారట. దీనికి నిర్మాత కూడా ఒప్పుకోవడంతో అంతా ఓకే అయింది. కానీ అప్పటికి దివ్యభారతి కేవలం పదో తరగతి మాత్రమే చదువుతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉన్నా కానీ వయసు చిన్నగా ఉండడంతో ఆమెను కూడా క్యాన్సల్ చేసేసారట. చివరికి ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన హీరోయిన్ మోహిని కి అవకాశం దక్కింది.. అలా బాలకృష్ణ మోహిని కాంబోలో ఆదిత్య 369 మూవీ తెరకెక్కి అద్భుతమైన హిట్ అందుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: