తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక అలా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈయన డిజె టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో సిద్దుకి ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది.

ఇకపోతే కొంత కాలం క్రితం సిద్దు "డిజె టిల్లు" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో సిద్దు క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే సిద్దు తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఏప్రిల్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కనుక ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj