సల్మాన్ ఖాన్ రష్మిక కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ మూవీ మార్చి 30 రంజాన్ కానుకగా విడుదలై ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఇన్ని రోజులు వరుస సినిమాలతో జోరు మీదున్న రష్మికకి ఈ మూవీ తేడా కొట్టడంతో చాలామంది రష్మిక పై ట్రోలింగ్ చేస్తుంటే మరి కొంత మందేమో సల్మాన్ ఖాన్ కి రష్మిక ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సినిమా ప్లాప్ అయితే ఆ భారమంతా హీరోయిన్ పైనే వేసేస్తున్నారు.పుష్ప -2, యానిమల్,ఛావా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో జోరు మీదున్న రష్మికకి ఈ సినిమా ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక సల్మాన్ ఖాన్ అయితే ఇకపై సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి ఇంటి దగ్గర కూర్చోవచ్చు అని ట్రోల్ చేస్తున్నారు. 

ఇదంతా పక్కన పెడితే.. సినిమా విడుదలయితే దాన్ని చూడడానికి కచ్చితంగా హీరో హీరోయిన్ డైరెక్టర్ నిర్మాత  వంటి సినిమాలో నటించిన వాళ్లు సినిమాకి సంబంధం ఉన్నవాళ్లు కచ్చితంగా వస్తారు.అలా రష్మిక తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఓ థియేటర్ కి సినిమా చూడడం కోసం వచ్చారు. ఆ టైంలో అక్కడే ఉన్న మీడియా వాళ్ళు, అభిమానులు రష్మిక మందన్నా,సల్మాన్ ఖాన్ ఇద్దరి ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. ఆ టైంలో రష్మిక కారు నుండి దిగుతుంది.అయితే రష్మిక కారు లోపలి నుండి దిగేలోపే సల్మాన్ ఖాన్ ఆమెను పట్టుకొని బయటికి లాగాడు.

ఇక సల్మాన్ ఖాన్ అలా చేయడంతో రష్మిక కాస్త అసహనంగా ఫీల్ అయింది. అంతేకాకుండా రష్మికను పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కాస్త అన్ ఈజీగా ఉన్నట్టు రష్మిక ఫేస్ లో ఇట్టే కనిపిస్తోంది. అయితే రష్మికను సడన్ గా సల్మాన్ ఖాన్ ని అలా లాగడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది సల్మాన్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.సికిందర్ ప్లాఫ్ అవ్వడంతో రష్మికపై ఆ కోపమంతా చూపిస్తున్నారా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: