
ఆ తర్వాత సుకుమార్ . అంతలా ఆయన పేరు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాని తెరకెక్కించాలి సుకుమార్ . ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిపోగానే సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకునిరాబోతున్నాడు. అయితే సుకుమార్ - రామ్ చరణ్ సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడు.
ఆల్రెడీ బన్నీతో సినిమాను కంప్లీట్ చేసేసాడు . పుష్ప3 అంటూ అనౌన్స్ మెంట్ వచ్చినా .. దానికి చాలా టైం పడుతుంది. దాదాపు మూడేళ్లు పైనే. అయితే ఈ లోపు మధ్యలోకి ఒక బిగ్ బడా స్టార్ లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని . సాధారణంగా టైర్ 2 హీరోలతో సుకుమార్ సినిమాను ఓకే చేయరు. అయితే నానితో మాత్రం సినిమాను ఓకే చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది . అది కూడా న్యాచురల్ గా ఉండే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. నాచురల్ స్టార్ నానితో న్యాచురల్ గా ఉండే స్టోరీ ని.. అది కూడా న్యాచురల్ డైరెక్టర్ ..ఇంకేముంది రచ్చ రంబోలానే ..కూల్ అండ్ క్లాసిక్ హిట్ పక్క అంటున్నారు అభిమానులు..!