టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అందుకున్న స్థాయి విజయాలను ఈ మధ్య కాలంలో అందుకోవడం లేదు. ఆఖరుగా ఈయన ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఈయన లైగర్ అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత పూరి జగన్నాథ్ "ఈస్మార్ట్ శంకర్" మూవీ కి కొనసాగింపుగా ... డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా వరుసగా రెండు భారీ అపజయాలను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతితో చేయబోతున్నాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను అనుకుంటున్నాట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది.

పూరి జగన్నాథ్ వరుసగా లైగర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలను ప్లాన్ ఇండియా మూవీలుగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడు. ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లు అయ్యాయి. ఇక విజయ్ సేతుపతి తో చేయబోయే సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ  , మలయాళ , హిందీ భాషలలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పూరి జగన్నాథ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: