సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోతుంది . ఎవరైనా సరే ఎవరినైనా విలన్ గా కానీ హీరోలుగా.. కానీ హీరోయిన్లుగా పెట్టి ఆ సినిమాలను తెరకెక్కించి..ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే.. ఖచ్చితంగా వాళ్ళనే మళ్లీ ఒక నాలుగైదు సినిమాలకు అదే రేంజ్ లో వాడేస్తూ ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరో శివాజీ పేరు మారుమ్రోగిపోతుంది. శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు మంచి సినిమాలల్లో నటించాడు .


కామెడీయన్ గా కామెడీ హీరోగా బాగా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు.  అయితే ఆ తర్వాత ఊహించని విధంగా పాలిటిక్స్ లోకి వేలు పెట్టిన ఆయన పేరు పై హ్యూజ్ ట్రోల్లింగ్ చేసుకున్నారు.  రీసెంట్గా శివాజీ నటించిన సినిమా "కోర్ట్".   ఈ సినిమాలో విలన్ షేడ్స్ లో ఆయన ఎలా మెప్పించాడు అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిపోయారు . ఆయన క్యారెక్టర్ ని తిట్టుకునే రేంజ్ లో ఆయన నటించాడు అంటే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత హైలెట్ అయింది అన్న విషయం అర్థం చేసుకోవచ్చు .



కాగా ఇప్పుడు శివాజీని విలన్ గా పెట్టి నటింపజేయాలి అంటూ చాలామంది ట్రై చేస్తున్నారు . వాళ్ళల్లో అనిల్ రావిపూడి కూడా యాడ్ అయిపోయినట్లు తెలుస్తుంది . చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో శివాజీని చూపించాలనుకుంటున్నాడట అనిల్ రావిపూడి . అందరూ ఎలా అయితే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారో.. శివాజీని విలన్  గా చూపించాలి అంటూ తాపత్రయ పడిపోతున్నారో.. అనిల్ రావిపూడి కూడా అలానే చేయబోతున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చిరంజీవి హీరోగా శివాజీ విలన్ గానా..? వామ్మో ఇంకేముంది వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అనిల్ రావిపూడి రాస్తే ఇంకా అదిరిపోయినట్టే అంటూ మాట్లాడుకుంటున్నారు . మరి ఇది ఎంతవరకు ఫైనలైజ్ అయింది అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు.  చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: