టాలీవుడ్ ఇండస్ట్రీలో బద్ధ శత్రువులుగా ఉన్న హీరోలలో నాగార్జున బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తాయి. వీరిద్దరి తండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.కానీ అలాంటిది నాగార్జున బాలకృష్ణ మధ్య మాత్రం బద్ధ శత్రుత్వం ఉంటుంది.ఓకే ఈవెంట్లో ఇద్దరు ఒకే దగ్గర కూర్చున్నా కూడా కనీసం పలకరించుకోరు అంత శత్రుత్వం ఉంది. అయితే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మంచి స్నేహమే ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఇద్దరి మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. అయితే అప్పట్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో బాలీవుడ్ మూవీ అయినటువంటి చుప్కే చుప్కే ని తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారట.

 బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్లో చుప్కే చుప్కే మూవీ రీమేక్ చేయాలి అని అనుకున్నారట.అయితే ఈ సినిమా తెలుగు లో తెరకెక్కపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.నాగార్జున బాలకృష్ణ కలిసి సినిమా చేద్దామనుకునే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్య తో కలిసి గుండమ్మ కథ సినిమాని రీమేక్ చేయాలి అనుకుంటున్నామని మీ కాంబోలో వస్తే మా కాంబో సెట్ అవ్వదు అని ఎన్టీఆర్ నాగార్జునతో చెప్పారట. 

దాంతో బాలకృష్ణతో నాగార్జున కలిసి చేయాల్సిన మల్టీస్టారర్ మూవీ అటకెక్కింది అంటూ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు బాలకృష్ణ తో సినిమాలో నటించాలి అనే కోరిక నాకు కూడా ఉంది. కానీ మనం అనుకున్నట్టు జరగవు కదా అంటూ ఆ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో సినిమా అవకాశం గురించి స్పందించారు. అయితే ఆ తర్వాత వీరు మళ్ళి సినిమా చేయాలి అనుకున్నప్పటికీ అప్పటికే వీరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో మళ్లీ వీరు ఎక్కడ కలుసుకోలేదు.అలా బాలకృష్ణ నాగార్జున కలిసి నటించాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ కారణంగా మూలన పడింది

మరింత సమాచారం తెలుసుకోండి: