
- విడిపోవడం తప్పదు అన్నప్పుడు.. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
- నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది.
- నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
- వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.
- పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?
- మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకి వస్తే నరకం.
- యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం.
- గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే.
- కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. మోసపోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
- మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.
- భయపడటంలోనే "పడటం" ఉంది.
- ఆశ కాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది.
- ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు.
- దేవుడు దుర్మార్గుడు.. కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తు చేస్తాడు.
- గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం. కానీ కోపమయినా, చిరాకయినా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం.
- సక్సెస్ లో ఏ వెధవాయినా నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో.
- కన్నీళ్లు చాల విలువయినవి.. విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు.
- తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
- ఎంత పెద్దవాడికి "No" చెప్తే అంత గొప్పవాడివి అవుతావు.
- బరువు పైన ఉంటే కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.