
ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం మాస్ సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 - తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అఖండ 2 సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తపై విద్యాబాలన్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో విద్యాబాలన్ నటించడం లేదని.. ఆమెకు అఖండ 2 సినిమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో విద్యా బాలన్ అఖండ 2 సినిమాలో నటిస్తుందని వార్త కేవలం రూమర్ అని తేలిపోయింది. గతంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించడంతో ఇప్పుడు అఖండ 2 లో ఆమె నటిస్తుందని వార్త చెక్కర్లు కొడుతుంది. ఇక అఖండ 2లో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగును మే నెలఖరకు ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకు రానున్నారు.