సీనియర్ దివంగత నటుడు శోభన్ బాబు అందానికి మారుపేరుగా ఉండేవారు. ఈయన అందానికి ఎంతో మంది హీరోయిన్స్ దాసులయ్యారు.అయితే అలాంటి శోభన్ బాబుని ప్రేమించిన హీరోయిన్ అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు జయలలిత మాత్రమే.దివంగత నటి, సీఎం అయినటువంటి జయలలిత శోభన్ బాబుని ఎంతో గాఢంగా ప్రేమించింది.కానీ వారి పెళ్లి జరగలేదు. అయితే చాలాసార్లు శోభన్ బాబుని జయలలిత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.కానీ వారి జీవితంలో పెళ్లి చేసుకునే యోగం లేదు కావచ్చు అందుకే జయలలిత చనిపోయే వరకు ఒంటరిగానే జీవించింది.అలాగే శోభన్ బాబు కూడా తాను పెళ్లి చేసుకున్న భార్యకు ద్రోహం చేయకూడదని జయలలితతో సంబంధం పెట్టుకున్నప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే జయలలిత మాత్రమే కాకుండా మరో సీనియర్ నటి కూడా శోభన్ బాబుని ఇష్టపడిందట. 

కానీ ఆయన మీద ఎంతో ప్రేమ పెంచుకున్నప్పటికీ వీరి పెళ్లి జరగలేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శోభన్ బాబుని అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు శారద.. సీనియర్ నటి శారద చలంని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చలంకి అప్పటికే పెళ్లయి భార్య చనిపోయింది.ఆ తర్వాత చలంతో పెళ్లయ్యాక ఆయన తాగుడుకి బానిసై శారదని టార్చర్ చేయడంతో ఆమె కూడా విడాకులు ఇచ్చేసింది. అయితే చలం కంటే ముందు శారదా శోభన్ బాబుని ప్రేమించిందట. శోభన్ బాబుని ఇంప్రెస్ చేయడానికి శారద శతవిధాలా ప్రయత్నించేదట. కానీ శోభన్ బాబు మాత్రం శారద మాయలో పడలేదు. ఇక శారద శోభన్ బాబు కాంబో అప్పట్లో హిట్ పెయిర్..  

వీరి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంతో శారదకి శోభన్ బాబు మీద ఇష్టం పెరిగింది.కానీ శోభన్ బాబు మాత్రం అందరు హీరోయిన్ లతో ఎలా ఉంటారో అలాగే ఉండేవారు. కానీ శారద మాత్రం శోభన్ బాబుని ప్రేమలో పడేయాలని చూసేది.. కానీ శోభన్ బాబు అందర్నీ లైట్ తీసుకునే వారట. అలా శోభన్ బాబుని ప్రేమించి లాభం లేకపోవడంతో చివరికి శారద చలం ప్రేమలో పడిందట. అయితే ఈ విషయాన్ని ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక శారద, జయలలిత మాత్రమే కాదు ఇంకా కొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా శోభన్ బాబుపై మనసు పడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: