
ఇక జపాన్లో దేవర సినిమాను ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా జపాన్ లో దేవర ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొరటాల శివ ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీమేక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సౌత్ ఇండియాలో కే.విశ్వనాధ్ అనే లెజెండ్రీ డైరెక్టర్ ఉండేవారు. ఆయన సాగర సంగమం సినిమాను తెరకెక్కించారు.
ఆ సినిమా ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయిందని.. ఆ సినిమాలో విశ్వనటుడు కమలహాసన్ నటించగా.. ఆ సినిమా అంటే ఈ జనరేషన్ డైరెక్టర్లకు ఎంతో ఇష్టం అంటూ కొరటాల తెలిపారు. సాగర సంగమం సినిమాని ఇప్పుడున్న డైరెక్టర్లలో ఎవరైనా రీమేక్ చేస్తే.. కేవలం ఎన్టీఆర్ మాత్రమే హీరోగా వారి చాయిస్ అని కొరటాల కామెంట్ చేశాడు. దీంతో సాగర సంగమం సినిమాను నిజంగానే రీమేక్ చేస్తే ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక కొరటాల శివ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.