కుంభమేళాలలో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించిన మోనాలిసాకు సినిమా అవకాశం కల్పిస్తానంటూ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెలియజేయడంతో ఒక్కసారిగా అటు డైరెక్టర్ పేరు మోనాలిసా పేరు కూడా వైరల్ గా మారింది. అయితే డైరెక్టర్ పైన కూడా చాలానే విమర్శలు వినిపించాయి.. అయినా కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ మోనాలిసా డైరెక్టర్ అలాంటివారు కాదని మంచివారు అన్నట్లుగా తెలియజేసింది. కానీ ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి సినిమా అవకాశాల పేరుతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోసం చేశారని.. అంతేకాకుండా తన పైన ఎన్నోసార్లు అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇదే అమ్మాయి పలు షాకింగ్ విషయాలను తెలియజేసింది.. సనోజ్ మిశ్రా అమాయకుడని తనను రేప్ చేయలేదంటూ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనని కావాలని ఇరికిస్తున్నారంటూ ఆ అమ్మాయి ఒక సంచలన ఆడియోతో సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తోంది. తాను సనోజ్ మిశ్రా తోనే ఉంటున్నానని ఆ వీడియోలో ఆమె తెలియజేసింది.


తమ ఇద్దరి మధ్య గొడవలు అయిన విషయం నిజమే కానీ.. సనోజ్ ఎప్పుడూ తనమీద అత్యాచారం చేయలేదంటూ ఆమె తెలియజేసింది.దీంతో ఈ కేసు పై మరొకసారి సర్వత్రంగా ఆసక్తిని కలిగించేలా చేసింది. మరి గతంలో కేసు వేసిన ఝాన్సీ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఇప్పుడు మరొకసారి ఫ్లేట్ ఫిరాయించినట్టుగా కనిపిస్తోందని నేటిజన్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ ఎలాంటి తప్పు చేయకపోతే కేసు ఎందుకు పెట్టారంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు పైన సనోజ్ మిశ్రా ను పోలీసు అధికారులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మోనాలిసాకు అవకాశం కల్పించడంతో ఈయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ గా మారడంతో మరొకసారి ఇప్పుడు చర్చనీ అంశానికి దారి తీసేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: