
మ్యాడ్2 సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయనే సంగతి తెలిసిందే. మ్యాడ్2 సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు కాగా రిలీజ్ కు ముందే 35 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఈ విధంగా రిలీజ్ కు ముందే 15 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ సినిమాను మేకర్స్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఆ విధంగా కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలోనే లాభాలు వచ్చాయని భోగట్టా.
మ్యాడ్2 సినిమాకు మరికొన్ని వారాల పాటు బాక్సాఫీస్ వద్ద ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మ్యాడ్2 సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్3 కూడా తెరకెక్కనుందని తెలుస్తోంది. 2027 సంవత్సరంలో మ్యాడ్3 విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాడ్1 స్థాయిలో మ్యాడ్2 సినిమా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయిందని కచ్చితంగా చెప్పవచ్చు.
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మ్యాడ్2 సినిమా రేంజ్ మరింత పెరిగేది. స్టోరీ లైన్ బాగానే ఉన్నా కథనంతో మ్యాజిక్ చేసే విషయంలో ఫెయిలయ్యారు. మ్యాడ్3 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది. మ్యాడ్2 సినిమాలో నటించిన ప్రతి పాత్రకు మంచి పేరు వచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. సితార మ్యాడ్2 సినిమా సక్సెస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి.