
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను పరిశీలిస్తే, ప్రధాన నటీనటులంతా నలుపు రంగు దుస్తుల్లో తీవ్రమైన భావాలతో కనిపిస్తున్నారు. వారి ముఖాలు పూర్తిగా కనిపించకపోయినా, కళ్లలో ఒకే తరహా ఉద్విగ్నత స్పష్టంగా తెలుస్తుంది.
ఈ పోస్టర్ ఒక ఉత్తమ హారర్ థ్రిల్లర్‌కు కావాల్సిన వాతావరణాన్ని సమర్థవంతంగా ప్రతిబింబిస్తుంది. సృజనాత్మకంగా రూపొందిన ఈ ఫస్ట్‌లుక్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో సూచన ఇచ్చారు నిర్మాతలు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఆధ్వర్యంలో కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, పద్మనాభన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయిబాబు తలారి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను అంజీ మాస్టర్ రూపొందించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని ఆశ్చర్యకరమైన అప్‌డేట్‌లను అందించాలని యూనిట్ భావిస్తోంది.
ఈ చిత్రంలో శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్రం, జెమినీ సురేష్ ప్రముఖ తారాగణంగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం జివికె సొంతం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. సినిమాటోగ్రఫీ జే ప్రభాకర్‌రెడ్డి, సంగీతం పద్మనాభన్ భరద్వాజ్, ఎడిటింగ్ సాయిబాబు తలారి, యాక్షన్ అంజీ మాస్టర్, సాహిత్యం ఉమా వంగూరి, నృత్య రీతులు రాజ్ కృష్ణ, పిఆర్ఓ సిద్ధు చేస్తున్నారు.