సాధారణంగా ఓ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు ఎంత ఉంటుంది ? 100 రూపాయల నుంచి 1000 , 2000 , 5000 గరిష్టంగా 10000 వరకు రావచ్చు .  అయితే మన భారతదేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటికి ఎంత కరెంటు బిల్లు రావచ్చు అనే విషయం తాజాగా ఇప్పుడు తెరపైకి వచ్చింది .. ఇందులో భాగంగా ఆ ఇంటి కరెంట్ బిల్లు అమౌంట్ ఇప్పుడు ఎంతో షాకింగ్ గా కనిపిస్తుంది. ఎస్..  ముకేశ్ అంబానీ ఇంటి గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
   

27 అంతస్తుల యాంటిలియా నివాసం 2005 లో ప్రారంభమై 2010 లో ఈ భవనం కట్టడం పూర్తయింది .. ముంబైలో ఉన్న అత్యంత లగ్జరీ నివాసమైన ఈ  యాంటీల నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాల 15 వేల కోట్లు .. అలాగే ఈ ఇంటి నిర్మాణాన్ని పెక్రిన్స్ అండ్ విల్, లాస్ ఏంజెలెస్ కు చెందిన హిర్ష్ బెట్నర్ అసోసియేట్స్ అనే నిర్మాణ సంస్థ చేపట్టింది .. అలాగే ఖర్చు పరంగా ఇది బకింగ్ హోమ్ ప్యాల‌స్  తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్‌ రికార్డ్స్ లో కూడా ఈ భవనం చోటు దక్కించుకుంది . ఈ క్రమంలో 4బ‌లక్షల చదరపు అడుగు ఈ ఇంటి కరెంటు బిల్లు ఎంత వస్తుంది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హాట్‌ టాపిక్ గా మారింది ..


అయితే ప‌లు నేషనల్ మీడియా నివేదికల ప్రకారం .. అత్యంత విలాసవంతమైన ఈ నివాసానికి మొదటి నెలలో  6,37,240 యూనిట్లు విద్యుత్ వినియోగించక బిల్లు సుమారు 70 లక్షల 70 వేలు అని నివేదికలు చెబుతున్నాయి .. అలాగే వీటితో పాటు ఈ బిల్లు సుమారు 7వేల ఇళ్ల‌ నెలవారి విద్యుత్ బిల్లుకు సమానమని నిపుణులు చెబుతున్నారు .  ఈ ఇంట్లో హెలీప్యాడ్ లు, లగ్జరీ కార్ల పార్కింగ్, విలాసవంతమైన స్పా, టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ ఫూల్, హై స్పీడ్ లిఫ్టులు, థియేటర్, జిమ్ , ఇలా మొదలైనవి అధునాతన సదుపాయాలు ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: