మన తెలుగు చిత్ర పరిశ్రమ లో వచ్చే సినిమాల్లో క్యామియో రోల్స్ అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న పదమే ..  ఆ సినిమాల్లో చిత్ర పరిశ్ర‌మ‌లో స్టార్ నటులు స్పెషల్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు .. అయితే అది  ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది .. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆయా రోల్స్ కు సరైన విధంగా సెట్ అయ్యే క్యాస్టింగ్ మేకర్స్‌ ఎంచుకొని రంగంలోకి దించుతారు. ఇక ఇదే విషయాన్ని ప్రమోషన్స్ టైం లో కూడా వాడుకుంటారు .. అయితే ఇప్పుడు క్యామియో రూల్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతుంది .. దీనివల్ల లాభాలు పక్కన పడితే బడ్జెట్ ఊహించని విధంగా పెరిగిపోతుందని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి .. ఇందుకు ఎగ్జాంపుల్స్ కూడా చాలా చెబుతున్నారు .  


ఇక రీసెంట్ గా నితిన్ రాబిన్ హిడ్‌ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే .  వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిన్న కామియోలో కనిపించారు .. ఇక అందుకోసం ఆయనకు మేకర్స్ దాదాపు మూడు కోట్లు ఇచ్చారని వార్తలు వచ్చాయి.. ఇక దీంతో అనేకమంది దీనిపై పెదవి విరుస్తున్నారు .. ఎందుకంటే సినిమాపై అసలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించని వార్నర్ రోల్‌కు అంత భారీ మొత్తంలో చెల్లించడం అవసరమా అని కామెంట్లు కూడా వస్తున్నాయి.   అలాగే ఆయన పాత్ర సినిమాలో అసలు ఇంపార్టెన్స్ లేదని చెప్పాలి .  దీంతో క్యామియో రోల్ కోసం అంత ఖర్చు పెట్టి తెచ్చి ఏం లాభం ఉందనే క్వశ్చన్ కూడా చేస్తున్నారు .  ఇదే క్రమంలో లైగ‌ర్ సినిమా ప్రస్తావన కూడా తీసుకువస్తున్నారు ..



ఇక ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే .  అయితే సినిమా రిలీజ్ కి ముందు ఆయన రోల్ పై చిత్ర యూనిట్ తెగ హైప్‌ క్రియేట్ చేశారు. కానీ రిలీజ్ తర్వాత అంత‌ రివర్స్ అయ్యింది .. టైసన్ కు లైగర్ సినిమా యూనిట్ 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపించింది .. ఇక దీనివల్ల ఎలాంటి లాభం కూడా లేదని చెప్పాలి .. ఇక దీంతో అంత కూర్చోబట్టే బదులు సినిమాకు అవసరమైన వాటిపై మేకర్స్ ఫోకస్ పెడితే బాగుంటుందనేది అనేకమంది వాదన .. ఎక్కడి నుంచో తీసుకువచ్చి డబ్బులు వృధా చేయాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు .. ఒక్కసారి ఇలాంటి వాటిపై పునరాలోచించాలని కూడా అంటున్నారు .. సరైన స్క్రిప్ట్ టాలెంటెడ్ కాస్టింగ్ ఉంటే చాలని కూడా అంటున్నారు .. మరి రాబోయే రోజుల్లో డైరెక్టర్స్‌ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: