
అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్నిటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు రాంగోపాల్ వర్మ .. ఓ సినిమా కు సంబంధించిన కథ రాయాలనుకున్నప్పుడు ఏకాంతంగా కనిపించకుండా కూర్చుంటాడట వర్మ . కొంతమంది దర్శకుల్లా ఏదో ఒక డెస్టినేషన్ కి వెళ్లడం తనకు ఇష్టం ఉండదని తన ఇంట్లోనే కూర్చుని కథ రాసుకుంటానని ఆర్జీవి చెప్పుకొచ్చాడు . అతేకాకుండా ఇప్పటికీ తానే సొంతంగా టైప్ చేసి కథను రాస్తున్నరట వర్మ .. ఒకరికి చెప్పుతూ టైప్ చేయించే పద్ధతి తనది కాదని తన మనసులో అనుకున్న స్టోరీని ఇంగ్లీష్లో టైప్ చేసి రాసుకుంటానని కూడా అన్నాడు ..
అలాగే ఒక కథ రాయడం అంటే మామూలు విషయం కాదు .. దాదాపు 60 సీన్‌లు రాసుకోవాలి ఒకే సీన్‌కు చాలా డిస్కషన్ ఉంటుంది అవన్నీ తానే టైప్ చేసుకుంటా అన్నాడు వర్మ .. ఇలా స్టోరీ మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డ్రాఫ్టును తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు పంపిస్తాడట .. వాళ్లు చూసి కొన్ని కొన్ని సూచనలు ఇస్తే వాటిని నచ్చితే తీసుకుంటాడట లేదంటే తన రాసుకున్న కథనే ఫైనల్ చేస్తారట . ఓ సినిమా తీయడానికి ముందు రాంగోపాల్ వర్మ స్టోరీ పై చేసే కసరత్తు ఇదన్నమాట .