
మొదటి సినిమా తర్వాత కోటి రూపాయలకు పైన రెమ్యూనరేషన్ దాటేసిన కృతి శెట్టి చేతిలో ఇప్పటికీ సినిమాలు ఉన్నాయి కానీ అవి ఇతర భాష సినిమాలు . ఇక మరో హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే .. ఊహించని స్పీడులో దూసుకు వెళుతుంది .. టాలీవుడ్ లోకి వచ్చిన మూడేళ్లలోనే డజన్ కు పైగా సినిమాలు చేసేసింది శ్రీ లీల.. మహేష్ ,రవితేజ ,రామ్ ,నితిన్ వంటి అందరి యంగ్ హీరోలతో నటించింది. అలాగే బాలయ్య కూతురుగా కూడా నటించింది . అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ కూడా చేసింది .. ఇప్పటికే శ్రీలీల చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి .. అయితే ఇక్కడ సమస్య ఒకటి .. విజయలు అన్నది జస్ట్ వన్ పర్సెంట్ కూడా ఈమె ఖాతాలో లేవు .. దీని కారణంగా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత ఈమె కెరియర్ అంతలా ముందుకు వెళ్లే అవకాశం ఎంతో తక్కువగా కనిపిస్తుంది.
మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు నటించే అవకాశమే ఎంతో తక్కువ అలాంటిది వచ్చిన అవకాశాల్లో కూడా ఫేస్ లో ఫీలింగ్స్ పలకటం లేదు అనిపించుకుంటే దానికి తోడు ప్లాఫ్‌లు పలకరిస్తే ఇదే పరిస్థితి వస్తుంది ఎలాంటి వారికైనా. కేవలం రెమ్యూనరేషన్ కోసం చేస్తూ పోతే పట్టుమని పది సినిమాలు చేయకుండానే ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లాల్సి ఉంటుంది . కథ తన పాత్ర ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి . ఇక మరి రాబోయే సినిమాల కైనా ఇద్దరు హీరోయిన్లు సరైన ఆలోచనతో ముందుకు వెళ్తారు లేదో చూడాలి.