మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి రియంట్రీ తర్వాత వరుస‌ సినిమాల తో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు .. కాని అందులో ఏ సినిమా కూడా మెగాస్టార్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి . రీయంట్రీ తర్వాత చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా చిరంజీవి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి .. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన సైరా ఒక తెలుగులోనే మినిమం కలెక్షన్లు తెచ్చుకొని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్ గానిలిచింది .


ఇక ఆ తర్వాత వచ్చిన బోళ‌ శంకర్, ఆచార్య, వంటి సినిమాలు చిరంజీవి స్టామినాను మరింత దెబ్బ కొట్టాయి .. అలాంటి చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తో కలిసి చేస్తున్న సినిమా విశ్వంభ‌ర‌ ..ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కారణంగా చిరు సినిమా వాయిదా పడింది .  కానీ ఇప్పటివరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనుకున్నంత స్థాయిలో ప్రకటించలేకపోయింది.  మధ్యలో వేస‌విలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన తర్వాత అది కూడా తుస్ మనపించారు .  


అలాగే చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న స్ట్రెయిట్ సినిమా కూడా ఇదే .. అలాగే భారీ విజువల్ ట్రీట్ మూవీ కావటం తో మొదటి నుంచి సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి .  అయితే ఈ ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫాన్స్ ఎదురుచూసారు కానీ వారికి డిసప్పాయింట్ గా మిగిలిపోయారు.   అయితే ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ కోసంఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. దీంతో మెయిన్ గా అప్డేడ్ , సినిమా రిలీజ్ పై ఓ క్లారిటీ ఏమన్నా వారు కోరుకుంటున్నారు .  అయితే ఇప్పుడు ఈ స్పెషల్ డే కి మేకర్స్ ఏమన్నా ప్లాన్ చేశారో లేదో వేచి చూడాలి .. ఇక ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: