సందీప్ రెడ్డి వంగ .. ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు మాత్రం వేరే లెవెల్.  రాజమౌళి - సుకుమార్ - ప్రశాంత్ నీల్ పేర్లు చెప్పిన సరే ఈ రేంజ్ లో అరుపులు కేకలు రావు.  దానికి కారణం నిజాన్ని నిజాయితీగా చూపించే సత్తా ఉన్న డైరెక్టర్ కావడమే . అర్జున్ రెడ్డి సినిమాను ఈ రేంజ్ లో ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించలేడు అంటూ చాలామంది స్టార్స్ ఒప్పుకున్నారు . నిజమే అర్జున్ రెడ్డి సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డివంగా .


అర్జున్ రెడ్డి అనుకుంటే దానికి అమ్మ మొగుడు లా యానిమల్ మూవీని  చిత్రీకరించారు . అనిమల్ సినిమాలో ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నాయో.. ఎలా ఫ్యామిలీ రిలేషన్స్ బేస్ అయి ఉంటాయి  అనే విషయాలను బాగా చూపించాడు . కాగా సందీప్ రెడ్డివంగా ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమాను డైరెక్టర్ చేయబోతున్నాడు . "స్పిరిట్" అంటూ ఎప్పుడో నామకరణం చేసేసాడు . ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను చూస్ చేసుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అది అఫీషియల్ గా మాత్రం ఇంకా బయటికి రాలేదు .



నయనతార - త్రిష ఈ ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది ఈ సినిమా విషయంలో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ప్రభాస్ తో ఏ డైరెక్టర్ చేయించలేని సాహసం ఈ సినిమాలో చేయిస్తున్నాడు సందీప్ రెడ్డివంగా . పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ప్రభాస్ ని చూపించబోతున్నాడు సందీప్ రెడ్డివంగా . అంతేకాదు ప్రభాస్ కు ఉన్న ఒక రియల్ జబ్బు ని రీల్ లో రియల్ గా చూపించబోతున్నాడట.  ప్రభాస్ చాలా చాలా తక్కువగా మాట్లాడుతాడు.  సిగ్గు ఎక్కువగా ఉన్న వ్యక్తి . అసలు ఏ విషయాన్ని ఓపెన్ అప్ అవ్వడు. అదే క్యారెక్టర్ ని ఇప్పుడు "స్పిరిట్" సినిమాలో చూపించబోతున్నారట సందీప్ రెడ్డివంగా.  ప్రభాస్ జెన్యూన్ గా ఎలా ఉంటాడు అనే విషయాన్ని తెరపై చాలా  చూపించబోతున్నారట.  దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ గా మారింది. స్పిరిట్ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ఓ బిగ్ హిట్గా మారిపోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు రెబల్ అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: