
రీసెంట్గా ప్రశాంత్ నీల్ భార్య షేర్ చేసిన ఒక ఫోటో ఎన్టీఆర్ ని ఎలా కాంట్రవర్షియల్ మేటర్ లో ఇరుక్కునేలా చేసిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ ఏదో విషయం కారణంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో పక్కనే సిగరెట్ ఆ పక్కనే మందు ఉన్న పిక్చర్ తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రశాంత్ నీల్ భార్య . దీంతో ఈ ఫోటో పెద్ద రాద్ధాంతంగా మారిపోయింది . ఆ విషయం పక్కన పెడితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా విషయంలో జనాలు ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది . అయినా సరే ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ పై జనాలు ఇంకా ఫుల్ గా సాటిస్ఫై కాలేకపోతున్నారు .
ఈ సినిమాలో ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ ని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు అని అయితే అర్థమైంది కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ తో ఉండే సీన్స్ చిత్రీకరించడానికి ఇంత లేట్ చేస్తున్నారు ..?అంటూ మాట్లాడుకుంటున్నారు నందమూరి అభిమానులు . నిజానికి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లోనే తారక్ ఉండాలి. కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యిందట. సమ్మర్ తర్వాత ఎన్టీఆర్ పై సీన్స్ చిత్రీకరించాలి అంటూ అనుకున్నారట. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన భార్యతో వెకేషన్ కి వెళ్ళిపోతున్నారట . దాదాపు రెండు నెలపాటు ఆయన సినిమా షూట్ ని పోస్ట్ పోన్ చేశారట. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. అసలే సినిమా ఆలస్యం అయిపోతుందన్న మూమెంట్లో ఇలా బ్రేక్ ఇవ్వడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు . ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ తో ఆటలా ..? ఆయన ఎంత బిజీ గల హీరోనో తెలియదా ..? అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారు..!