టాలీవుడ్ ఇంట్రెస్ట్ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోయిన్లలో అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంత ముందు వరుసలో ఉంటారు. వీరు ముగ్గురు కూడా కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత కూడా వీరు వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించారు. ఇకపోతే అద్భుతమైన క్రేజ్ కలిగిన ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో ఒకే రూట్లో పయనిస్తున్నారు.

అదేమిటి అనుకుంటున్నారా ..? వీరు ముగ్గురు కూడా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఒకే రూట్లో పయనిస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే ... అనుష్క చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన స్టాలిన్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు అనుష్క వేరే ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇక కాజల్ అగర్వాల్ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా కాజల్ అగర్వాల్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

కానీ కాజల్సినిమా తర్వాత మరే ఇతర సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. సమంత కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ పుష్ప 1 సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు సమంత వేరే ఏ ఇతర సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇలా ఈ ముగ్గురు కూడా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క స్పెషల్ సాంగ్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: