మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీ ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడం , ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే కన్నడ , తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ రెండు సినిమాల్లో ఒకే బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఇక ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయి. మరి రష్మిక రిజక్ట్ చేసిన ఆ రెండు సినిమాలేవి ..? అందులో నటించి అపజయాలను అందుకున్న ఆ బ్యూటీ ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇక ఈ సినిమాలో మొదట పూజ హెగ్డే పాత్రలో రష్మికను తీసుకోవాలి అనుకున్నారట. కానీ రష్మిక ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో పూజ హెగ్డే ను ఆ పాత్రకు తీసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీలో మొదట రష్మిక ను హీరోయిన్గా తీసుకోవాలి అని అనుకున్నారట. కానీ ఆ ఆఫర్ను రష్మిక రిజెక్ట్ చేసిందట. ఇలా రష్మిక రిజక్ట్ చేసిన ఈ రెండు సినిమాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిందట. ఇక ఈ రెండు మూవీల ద్వారా ఈ ముద్దుగుమ్మకు అపజయాలు దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm