టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సుకుమార్ ఒకరు. సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ , సుకుమార్ , దిల్ రాజు ముగ్గురికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా సుకుమార్ , అల్లు అర్జున్ హీరో గా దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట.

కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్ లో ఈ కాంబోలో మూవీ క్యాన్సల్ అయ్యిందట. అసలు విషయం లోకి వెళితే ... ఆర్య మూవీ తర్వాత సుకుమార్ , రామ్ పోతినేని హీరోగా జగడం అనే మూవీ ని రూపొందించాడు. కాకపోతే ఇదే కథతో సుకుమార్ , అల్లు అర్జున్ హీరో గా దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా దిల్ రాజు కు ఈ కథను కూడా వినిపించాడట. కథ మొత్తం విన్న దిల్ రాజు ఈ సినిమా కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేయాలి. ఇలాగే తీస్తే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు అని చెప్పాడట. దానితో సుకుమార్ ఆయన మాట అస్సలు వినలేదట. ఇక ఆ కథ విషయంలో దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే అల్లు అర్జున్ కూడా సుకుమార్ కి చెప్పాడట. దానితో ఆయన వారి మాటలను పట్టించుకోలేదట.

ఇక సుకుమార్ అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నా వారు ఇద్దరు తన మాటలను పెద్దగా పట్టించుకోకపోవడంతో వెంటనే ఆ కథను రామ్ పోటినేని కి చెప్పి వేరే నిర్మాతతో సినిమాను ఓకే చేయించుకున్నాడట. ఇక జగడం అనే టైటిల్తో ఆ మూవీ ని రూపొందించగా మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అలా సుకుమార్ ... దిల్ రాజు , అల్లు అర్జున్ చెప్పిన మాటలకి ఫీల్ అయ్యి జగడం మూవీ ని రామ్ పోతినేనితో తీసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: