ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో చాలా సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు కూడా ఈ మధ్య కాలంలో దక్కుతున్నాయి. ఇకపోతే బాలకృష్ణ చాలా సంవత్సరాల క్రితం ఆదిత్య 369 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కెరియర్లోనే భారీ విజయం సాధించిన సినిమాల లిస్టులో ఈ మూవీ చేరిపోయింది. ఇక ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను ఏప్రిల్ 4 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్న కేశవ రెడ్డి సినిమా కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన రికార్డును కూడా సృష్టించింది. చెన్న కేశవ రెడ్డి సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 1.10 కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన ఇంపాక్ట్ ను రీ రిలీజ్ లో భాగంగా చూపించింది. ఇక మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి ఆదిత్య 369 సినిమా కూడా రీ రిలీజ్ కాబోతోంది. దానితో ప్రస్తుతం బాలకృష్ణ అభిమానులు ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది.

సినిమా కేవలం చెన్న కేశవ రెడ్డి మూవీ రీ రిలీజ్ రికార్డులను మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల రీ రిలీజ్ రికార్డులను కూడా క్రాస్ చేస్తుంది అనే ఆశాభావాన్ని బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఆదిత్య 369 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపించి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: