కొన్ని సంవత్సరాల క్రితం వరకు మురగదాస్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్టులో కొనసాగుతూ ఉండేవారు. ‘గజనీ’ మూవీతో అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. ‘తుపాకి’ ‘కత్తి’ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో టాప్ హీరోలు అంతా అతడితో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరిచేవారు. ఆతరువాత మహేష్ తో తీసిన ‘స్పైడర్’ ‘సర్కార్’ ‘దర్బార్’ మూవీలు వరస పరాజయం చెందడంతో అతడి కెరియర్ పూర్తి సమస్యలలో పడిపోయి అతడి మార్కెట్ కూడ పూర్తిగా దెబ్బతింది.

ఇలాంటి పరిస్థితులలో వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మురగాదాస్ తో కలిసి నటించిన ‘సికిందర్’ మూవీ ఘోరమైన టాక్ తెచ్చుకోవడంతో మురగాదాస్ కెరియర్ పూర్తిగా పరిసమాప్తం అయిపోయినట్లు అనుకోవాల అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ పై మురగాదాస్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు.

అయితే  ఈ మూవీని చూసినవారు భయంకరమైన ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఈ సినిమాను చూడవద్దు అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ తో హడావిడి చేస్తున్నారు. అంతేకాదు క్రేజీ హీరోయిన్ రష్మిక సల్మాన్రొమాంటిక్ సీన్స్ చూసి ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో మురగాదాస్ లేటెస్ట్ గా తమిళ హీరో శివ కార్తికేయన్ తో కార్తికేయన్ తో తీస్తున్న ‘మదరాసి’ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.

‘అమరన్’ మూవీతో శివ కార్తికేయన్ కు తెలుగు ప్రేక్షకులలో కూడ చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం సక్సస్ ట్రాక్ లో కొనసాగుతున్న శివ కార్తికేయన్ మురగాదాస్ తో మూవీ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకుల నాడీ పసికట్టడంలో ఎంతో అనుభవం ఉన్న మురగాదాస్ ‘సికిందర్’ లాంటి చెత్త సినిమా తీయడం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చాలమంది షాక్ అవుతున్నారు..












మరింత సమాచారం తెలుసుకోండి: