సినిమా ఇండస్ట్రీలోకి అనేక మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా కాలం పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులుగా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో అనేక మంది కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటించి తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ తర్వాత మాత్రం కమర్షియల్ సినిమాలలో అందాలు ఆరబోయడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి సీనియర్ ముద్దుగుమ్మలు ఎక్కువ శాతం ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇక ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటిమణులు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ,  పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలు అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఈ విషయంలో ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. ఆమె మరెవరో కాదు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చాలా సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా కెరియర్ను అదే రేంజ్ లో అనేక సంవత్సరాల పాటు కొనసాగించింది.

ఇక ఈ మధ్య కాలంలో కాజల్ కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఇక అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన ఆ జోనర్ మూవీల ద్వారా మాత్రం ఈ బ్యూటీకి మంచి విజయాలు బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. తాజాగా కూడా కాజల్ "సత్యభామ" అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: