ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో మరి ఏ ఇండస్ట్రీలో లేనంత మంది యంగ్ హీరోలు ఉన్నారు .. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్ ,శర్వానంద్ విశ్వక్‌, సందీప్ కిషన్, నితిన్ ఎంతోమంది ఈ లిస్టులో ఉన్నారు . కానీ వీరిలో ఎంతమంది ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు కాల‌నికి అనుగుణంగా సినిమాలు చేస్తున్నారు మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి వచ్చింది .. అందుకు కారణం వారు చేస్తున్న సినిమాలనే చెప్పాలి .. ఒక్క సినిమా హిట్ అయితే వెంటనే హ్యాట్రిక్ అపజయాలు అందుకుంటున్నారు కొందరు హీరోలు .. ఒకప్పుడు భారీ విజయాలు అందుకుని ఇప్పుడు హిట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొందరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ..


గీత గోవిందం విజయ్ దేవరకొండ చివరి బ్లాక్ బస్టర్ .. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో .. అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత హ్యాట్రిక్ ప్లాప్‌లు అందుకున్నాడు రామ్ .. అలాగే శర్వానంద్ కూడా అప్పుడెప్పుడో శతమానం భవతి సినిమా తర్వాత మళ్లీ హిట్ మాట వినలేదు .. అలాగే విశ్వక్ కూడా సరైన హిట్‌ చూసి చాలా కాలం అవుతుంది .. ఇక నితిన్ సంగతి ఎంత చెప్పుకుంటే అంత మంచిది .  ఇక అక్కినేని హీరో అఖిల్ సంగతి సరే సరే .. ఈ అక్కినేని హీరో  హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు .. వీరే కాకుండా ఇంకా చాలామంది ఇతర హీరోల పరిస్థితి ఇలానే ఉంది . ఒక హిట్‌ రాగానే అదే జోనర్‌లో సినిమాలు చేయడం లేదా కాంబినేషన్స్ అంటు పరుగులు తీయటం .. ఒక్కసారి జరిగే దాన్ని మ్యాజిక్ అంటారు అలా అని అదే ప్రతిసారి చేస్తా అంటే ఎవరూ పట్టించుకోరు .. ఇక్కడ హీరోలు తెలుసుకోవాల్సింది కూడా అదే .  కాంబినేషన్స్ కాదు కొత్త కథల మీద వారి దృష్టి పెట్టాలి .  అలాగే సరికొత్త జోనర్లు ట్రై చేయాలి ..


ఒక విధంగా చెప్పాలంటే నేచురల్ స్టార్ నానిని చూసి అందరూ ఎంతగానో నేర్చుకోవాలి .. ప్లాప్‌లు వచ్చిన వెంటనే అంటే సుందరానికి , జెర్సీ వంటి సినిమాలు చేస్తూ నాని అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులకి సెట్ అయ్యేలా చేశాడు . అలాగే దసరా , సరిపోద్ద శనివారం వంటి మాస్ కంటెంట్ సినిమాల తో కూడా విజయాలు అందుకున్నాడు .. అలాగే మధ్యలో హాయి నాన్న వంటి క్లాసిక్ సినిమాలు తో విజయం ఇచ్చాడు .. ఇలా మిగిలిన హీరోలు ఎందుకు ఆలోచించటం లేదు .. ఎప్పుడు రొటీన్ సినిమాలు చేస్తామంటే ఆడియన్స్ పక్కకు పొమ్మంటారు .. అలాగే మాస్ మాస్ మాస్ అని జపం ఆపేసి కాంబినేషన్స్ పిచ్చి తగ్గించి ట్రెండ్‌ని ఫాలో అయ్యే యంగ్‌ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలి .. లేదంటే ఒక హిట్‌ కొట్టి ఆ తర్వాత విజయాలు లేక కనుమరుగైన జాబితాలో ఇప్పటి యంగ్ హీరోలు కూడా చేరాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: