ఇది ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంజాయ్ చేసే మూమెంట్ . జనరల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయం వైరల్ అయిన ట్రెండ్ అయిన పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.  కానీ ఆ ఫీలింగ్ అన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చే ఫీలింగ్..ఈ  స్పెషల్ ఫీలింగ్.  ఎందుకంటే పవర్ స్టార్ గురించి మాట్లాడుకోవాలంటే మరీ ముఖ్యంగా సినిమాలు గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క అభిమాని గుర్తు చేసుకునే సినిమా "ఖుషి". తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ ని ఎలా మలుపు తిప్పిందో .."ఖుషి" సినిమా అంతకు డబల్ స్థాయిలోనే మలుపు తిప్పింది.  ఎవరినైనా సరే గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు "ఖుషి".


సినిమా ఎన్నిసార్లు చూసినా తనవి తీరదు.  ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఒక స్పెషల్ ఫీలింగ్ కలుగజేసే సినిమా . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.  వేరే లెవల్ అనే చెప్పాలి . ఇంకా భూమిక - పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ హైలెట్ . పాటలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇప్పటికి మన ప్లే లిస్ట్ లో ఖుషి సినిమాలోని స్పెషల్ సాంగ్స్ ఎప్పుడూ ఉంటాయి . అంత హైలెట్ గా ఉంటాయి పాటలు.  మరి ఇలాంటి సినిమాకి సీక్వెల్ వస్తే ఇక నో డౌట్ . ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్లాస్ట్ చేసేస్తుంది . అది కూడా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వారసుడు నటిస్తే మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .



ఓన్లీ రికార్డ్ బ్లాస్టింగ్ . ఈ రేంజ్ లోనే ఉంటుంది సినిమా లెవెల్ . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన కెరీయర్ని మలుపు తిప్పిన "ఖుషి" సినిమా సీక్వెల్ ద్వారా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఇండస్ట్రీ లోకి ఎంటృఈ ఇవ్వబోతున్నారట . పాలిటిక్స్ లో  బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తో కూడా ఈ సినిమా విషయాల గురించి చర్చించేసారట మేకర్స్ .అంతేకాదు వైజయంతి బ్యానర్ లోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారట అశ్విని దత్.  సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది .



అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని చూస్ చేసుకోవాలనే దానిపై ఇప్పుడు బిగ్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయట . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ చక చక కంప్లీట్ చేసి అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 8వ తేదీ అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ డీటెయిల్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!
'

మరింత సమాచారం తెలుసుకోండి: