లేడీ అమితాబ్ , లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే అంత ఇమేజ్ సంపాదించుకున్న నటి .. విజయశాంతి .. రాజకీయాల్లో కి వెళ్లాక సినిమాల పై పూర్తిగా తన ఫోకస్ తగ్గించారు . అయితే చాలాకాలం తర్వాత ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాల్లో తన ఇమేజ్ కు తగ్గ పాత్రలో కనిపించారు .  ఇక ఈ సినిమాకు విజయశాంతి తీసుకున్న  పారితోషికం గురించి అప్పట్లో ఎంతో ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది.  ఇక ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ హై జయంతి సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నారు విజయశాంతి .  కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన సినిమా ఇది . ఇక ఈ సినిమా కోసం కూడా విజయశాంతి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల టాక్ ..


ఇక ఈ లేడీ  సూపర్ స్టార్ కు దాదాపు 3 కోట్లు ఇచ్చారు అన్నది ఓ టాక్ .. మూడు కోట్లు అంటే ఎక్కువ మొత్తం కాదు స్టార్ హీరోయిన్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ .. ఇది విజయశాంతి రేంజ్  ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం . తల్లి కొడుకుల స్టోరీ ఇది .. విజయశాంతి పాత్ర ని ఎంతో పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు .. కర్తవ్యం సినిమాలోని వైజయంతికి ఓ కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచన నుంచి ఈ కథ వచ్చింది .. ఇక దాన్నిబట్టి విజయశాంతి పాత్రకు ఉన్న ప్రాధాన్య‌త ఎంతో అంత అర్థం చేసుకోవచ్చు .. రీసెంట్ గానే టీజర్ రిలీజ్ అయింది మంచి స్పందన కూడా తెచ్చుకుంది .. ఇప్పుడు ట్రైలర్ కూడా రెడీ అవుతుంది ..


ఇక ట్రైలర్ క‌ట్‌ చూసిన వాళ్లు కళ్యాణ్‌రామ్ కెరియర్ లో మరో హిట్ గ్యారెంటీ అని అందరూ జోష్యం ముందే చెప్పేస్తున్నారు .. అంత బాగా నచ్చిందట .. ఇక సాధారణంగా సినిమా విడుదలకు వారం పది రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు .. అయితే ఈ సినిమా విషయంలో మూడు వారాల ముందే ట్రైలర్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట .. ఇక రీసెంట్ గానే ఓ మాస్ సాంగ్ కూడా రిలీజ్ అయింది .. దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ..  ఇక సినిమా రిలీజ్ కి ముందు కాస్త ప్రచారం గట్టిగా చేసుకుంటే భారీ ఓపెనింగ్స్‌ అందుకుని అవకాశం కూడా ఎంతో పుష్కలంగా కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: