టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నాగవంశీ గురించి చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోలతోనే కాకుండా చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. సినిమా మొదలైంది మొదలు రిలీజ్ వరకు సినిమా హైపును తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా సినిమాల పైన రివ్యూలు వాటి అభిప్రాయాలను సైతం సోషల్ మీడియాలో పెట్టే వారి పైన నిర్మాత నాగావంసి తాజాగా ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. మ్యాడ్ స్క్వేర్ కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయిందని హిట్టు టాక్ తెచ్చుకున్నప్పుడు ఎందుకు ప్రోత్సహించారు అంటూ ఫైర్ అయ్యారు.


బ్యాడ్ స్క్వేర్ లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ వంటి వారు నటించారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించగా గత నెల 28వ తేదీన  విడుదల అయ్యింది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే ఈ రోజున నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ కంటెంట్ లేకపోయినా కూడా కొన్ని సినిమాలు సీక్వెల్ కాబట్టి ఆడుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరైనది కాదు అంటూ తెలిపారు.


సినిమా ఎలా ఉన్నా చూడడానికి ఇది బాహుబలి 2, పుష్ప 2, కే జి ఎఫ్ 2 కాదని తెలిపారు. సినిమాలో కంటెంట్ లేకుండా చూడడానికి ఇందులో ఎవరు కూడా స్టార్ హీరోలు లేరు. మ్యాడ్  స్క్వేర్ చిత్రాన్ని థియేటర్లలో చాలాసార్లు చూశాము కాబట్టే ప్రేక్షకుల స్పందన బాగుంది ఆడియన్స్ తెలిసినంతగా రివ్యూలకు సరిగ్గా తెలియదేమో అంటూ ప్రశ్నించారు. నా మీద పగ ఉంటే దమ్ము ఉంటే నా చిత్రాలను బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయండి.. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్సైట్లో రన్ అవుతున్నాయి తాను ఇంటర్వ్యూలు ఇస్తే యూట్యూబ్ ఛానల్ కు పనిగా ఉపయోగపడుతున్నాయి అంటూ తెలిపారు. సినిమాను చంపకండి సినిమా ఆడుతున్నప్పుడు కూడా కంటెంట్ లేని సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో తెలియదు అంటూ ఎవరూ కూడా తీర్పులు చెప్పకండి అంటూ తెలిపారు.. సినిమాలు బాగా ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే అందరూ ఇంటికి వెళ్లాల్సిందే అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: