టాలీవుడ్ యంగ్‌ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒకేసారి రెండు మూడు స్క్రిప్టుల పై వర్క్ చేస్తున్నాడు .. ఇక అందులో ఒకటి ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’ , మరొకటి జై హనుమాన్ .. ఈ రెండు సినిమాల కథల పై  త‌ల‌మున‌క‌లై క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు .. బ్ర‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’ కథ‌ ప్రభాస్ కోసం రెడీ చేసిన విషయం తెలిసిందే .. ఇక హనుమాన్ సిక్వల్ గా జై హనుమాన్ రాబోతుంది .. జై హనుమాన్ లో ప్రధాన పాత్ర కోసం రిష‌బ్ శెట్టిని  తీసుకున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఇంకా చాలామంది హీరోలు ఉండబోతున్నారట ..


ఇక రాముడు పాత్ర కోసం స్టార్ హీరోని సంప్రదించినట్టు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి .. అంతేకాకుండా ఇది సప్త చిరంజీవులు స్టోరీ అని కూడా టాక్ .. ఇక మన పురాణాల్లో హ‌నుమంతుడు , అశ్వ‌ద్ధామ , బ‌లి , కృపుడు , ప‌ర‌శురాముడు ఇలా ఏడుగురు చిరంజీవులు ఉన్నారు .. ఇక వారందరి నీ ఈ సినిమాలో చూపించబోతున్నారట .. ఇలా ఒక్కో పాత్ర కు ఒక్కో హీరోని తీసుకుంటే ఇక స్క్రీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇండియాలో నే బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా ఈ సినిమా నిలుస్తుంది . ..ఇక ప్రశాంత్ వర్మ ఆలోచన కూడా అదే .  అయితే కాకపోతే హనుమంతుడు , అశ్వద్ధామ , పరుశురాముడు పాత్రలని చూపించినట్టు మిగిలిన పాత్రను అంత స్కోప్ ఇవ్వలేడేమో ..


గెస్ట్ రోల్స్ వరకు ఓకే .. అయితే వాటిని ఫుల్ లెంగ్త్ లోకి మార్చడం చాలా కష్టం .. కాకపోతే ఇది సింగల్ హీరో కథ కాదు కనీసం మరో ఇద్దరు ముగ్గురు హీరోలైన ఇందులో కనిపిస్తారు .. కనిపించాలి కూడా .. ఇక అప్పుడే ఆయా పాత్రలకు ఎంతో వెయిట్ వస్తుంది .. ఇక ప్రస్తుతం జై హనుమాన్ స్క్రిప్ట్ పనులు ఎంతో చురుగ్గా  నడుస్తున్నాయి .. ఇక వచ్చే సెప్టెంబర్ నుంచి రిషబ్ శెట్టి డేట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది .. అంతకంటే ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తారు .. ఫ్రీ విజువల్ వర్క్ కూడా ఎంతో ప‌క‌డ్బందీగా చేయడం కార‌ణంగా షూటింగ్ ఈజీగా మారింది .. 2026 లో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తారు ఆ తర్వాత ప్రభాస్ తో ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’  చేయబోతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: