
పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు . ప్రభాస్ ఎంత జెన్యూన్ కల మనిషి అనేది అందరికీ తెలిసిందే. ప్రభాస్ చాలా ఓపెన్ గా అన్ని విషయాలు చెప్పేస్తుంటాడు చాలా తక్కువగా మాట్లాడుతాడు . స్టేజి ఈవెంట్స్ లో మాట్లాడాలి అంటే అస్సలు మెలికలు తిరుగుతాడు.. సిగ్గు పడిపోతూ ఉంటాడు. అలాంటి ప్రభాస్ లో ఉన్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . అది కూడా గోపీచంద్ బయట పెట్టడం గమనార్హం.
ప్రభాస్ కి ఎవరైనా వ్యక్తి నచ్చితే వాళ్లతో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారట . మరీ ముఖ్యంగా ఆయన బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే పర్సన్ లు చాలా తక్కువగా ఉంటారట . కానీ అలా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వాళ్ళతో ఏ విషయం మాట్లాడుతున్న సరే చాలా జోవియల్ గా మాట్లాడుతూ ఉంటారట. ఏదైనా విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు "తడుతూ .. నెడుతూ.. చేతులతో.. తోస్తూ మాట్లాడుతూ ఉంటాడట ". ఒకానొక టైం లో గోపీచంద్ కి ముక్కు అస్సలు బాగోలేదు అని చెప్పిన సరే అసలు వినలేదట . ఏదో నవ్వుతూ మాట్లాడుతూ టపీ అంటూ ముక్కు మీద కొట్టేసాడట . అది ప్రభాస్ కి చాలా చాలా అలవాటు. ప్రభాస్ ఇప్పటికి ఎవరితోనైన క్లిఝ్ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు తన క్లోజ్ గా ఉండే పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు మీద చేతులు వేస్తూ తడుతూ నెడుతూ గిల్లుతూ అలానే మాట్లాడుతూ ఉంటారట. ఈ విషయాన్ని మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనాలు..!