గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “పెద్ది”.. గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ గట్టి హోప్ ని ఇచ్చింది. ఇటీవల చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ తో పాటు రాంచరణ్ లుక్ ను కూడా రిలీజ్ చేసారు.. రాంచరణ్ ఈ సినిమాలో ఫుల్ మాస్ రోల్ చేస్తున్నాడు..అయితే అదే రోజు పెద్ది గ్లింప్స్ కూడా రిలీజ్ కావాల్సి వుంది.. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేకర్స్ రిలీజ్ చేయలేదు.. గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌ వెయ్యికళ్లతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఉగాదికి సైతం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది.నిజానికి ఈ గ్లింప్స్ ఇంకా రెడీ కాలేదని సమాచారం..

పాన్ ఇండియా లెవల్లో ఆర్ ఆర్ ఇవ్వాలంటే కాస్త టైమ్‌ పడుతుంది..దీనికి తోడు ఏఆర్ రెహమాన్ కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండటంతో గ్లింప్స్ మేకింగ్ పెండింగ్‌లో పడింది.దీంతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హెల్ప్‌తో శ్రీరామ నవమికి పెద్ది గ్లింప్స్ తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా మేకర్స్ పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. 'ఫస్ట్ షాట్‌' పేరుతో 'పెద్ది' మూవీ నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుదలవుతుందని తాజాగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

 అందులో క్రీడా మైదానంలోకి డైనమిక్‌గా దూకుతోన్న రామ్ చరణ్‌ లుక్ అదిరింది... ఈ పోస్టర్‌తో గ్లింప్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు ఈ సినిమాలో కీలక పాత్ర లో నటిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: